
జనసేన కార్యకర్తలపై పోలీసుల లాఠీ చార్జీ
విజయనగరం ( జనస్వరం ) : స్థానికంగా పార్వతీపురం లో వివేకానంద కాలానికి అనుకుని ఉన్న శ్మశాన వాటికలో సీతానగరం మండలానికి చెందిన కరోనాతో చనిపోయిన ఇద్దరి శవాల్ని గవర్నమెంట్ అధికారులు పూడ్చి పెడుతుండగా, ఈ విషయం స్థానిక ప్రజలు జనసేన పార్టీ కార్యకర్తలు శ్మశాన వాటిక వద్ద ప్రశ్నించారు. తరువాత జన సైనికులు పై లాటి చార్జ్ చేయడం జరిగింది, దానిని ఖండిస్తూ, పార్వతీపురం మున్సిపల్ ఆఫీసు కు స్థానిక ప్రజలు మద్దతుతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు వివరణ ఇస్తూ మరి ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం వలన ఈ తప్పు జరిగిందని మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని పార్వతీపురం మున్సిపల్ కమీషనర్ గారు చెప్పారు.









