నెల్లూరులో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలు

బీవీఆర్‌ నగర్‌లో ఘనంగా కేక్‌ కట్‌ చేసిన నాయకులు

నెల్లూరు, సెప్టెంబర్ 19 (జనస్వరం) : నెల్లూరులోని బీవీఆర్‌ నగర్‌లో ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌లో శనివారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతారామపురం మండల మాజీ కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు, దుత్తలూరు మాజీ ఎంపీపీ చీమకుర్తి రవీంద్రబాబు, ఉదయగిరి బీజేపీ నాయకులు గడ్డం ప్రసాద్, నందిపాడు టీడీపీ నాయకులు ప్రసాద్ నాయుడు, తెలుగు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్‌ చేసి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి, ప్రజా సేవా కార్యక్రమాలను నాయకులు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వివిధ సేవా కార్యక్రమాలకు ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.

See also  జనసేన ఆధ్వర్యంలో చంద్రమోహన్ కు సన్మానం