35 ఏళ్ల రాజకీయ కోటను బద్దలు కొట్టిన జనసేనపార్టీ అభ్యర్థి శ్యామల

– అనంతపురం అర్బన్ 12వ డివిజన్‌లో జనసేన అభ్యర్థికి ఘన విజయం

    అనంతపురం, నవంబర్ 4 (జనస్వరం): అనంతపురం అర్బన్ 12వ డివిజన్ కార్పొరేటర్‌గా జనసేన పార్టీ అభ్యర్థి శ్యామల అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించారు. గత 35 ఏళ్లుగా కొనసాగుతున్న రాజకీయ ఆధిపత్యానికి తెరదించుతూ ఆమె సాధించిన ఈ విజయం డివిజన్‌లో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా జనసేన నాయకుడు సింగరాయని చైతన్య కృష్ణ మాట్లాడుతూ, 12వ డివిజన్‌లో 35 ఏళ్ల రాజకీయ కోటను బద్దలు కొట్టి తమ అమ్మ శ్యామల ఘన విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. డివిజన్‌లోని సమస్యలను గుర్తించి, ప్రజలందరినీ కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ గొప్ప విజయానికి సహకరించిన 12వ డివిజన్ ప్రజలకు, మిత్రబృందానికి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.సి. వరుణ్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, పార్లమెంట్ సభ్యుడు అంబికా లక్ష్మీనారాయణతో పాటు ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ సింగరాయని చైతన్య కృష్ణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

See also  విశాఖలో తూర్పు ముఖద్వార అభివృద్ధిపై కీలక సదస్సు 

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :