మున్సిపల్ ఎన్నికల్లో తనకు జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే బాలకృష్ణకు మరియమ్మ చక్రవర్తి వినతి

– న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. సమస్యను సానుకూలంగా పరిశీలిస్తామని వెల్లడి
హిందూపురం, నవంబర్ 24 (జనస్వరం): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు జనసేన పార్టీ హిందూపురం మండల అధ్యక్షుడు పి. చక్రవర్తి సతీమణి మరియమ్మ చక్రవర్తి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల సమయంలో తనకు ఎదురైన సమస్యలు, జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లి వివరించారు. ఈ సందర్భంగా మరియమ్మ చక్రవర్తి వివరించిన సమస్యలను ఎమ్మెల్యే బాలకృష్ణ సానుకూలంగా పరిశీలించారు. ఆమెకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తన సమస్యను ఓపికగా విని, సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మరియమ్మ చక్రవర్తి కృతజ్ఞతలు తెలిపారు.

See also  జై అమరావతి నినాదంతో వేడుకలు నిర్వహించిన నెల్లూరు జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :