పీజేఆర్ స్టేడియం యోగా ప్రాంగణంలో సౌకర్యాలు కలిపించండి

– ఎమ్మెల్యే, జోనల్ కమిషనర్ లకు యోగాభ్యాసకుల వినతి

శేరిలింగంపల్లి, నవంబర్ 9 (జనస్వరం) : పీజేఆర్ స్టేడియంలోని యోగా ప్రాంగణంలో సౌకర్యాలు కల్పించాలని కోరుతూ పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ అమిత్ నారాయణ్‌లకు యోగాభ్యాసకులు సోమవారం వినతి పత్రాలు అందజేశారు. యోగ శిక్షకులు పుట్ట వినయ్ కుమార్ గౌడ్, జగన్నాథంలు అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే, జడ్సీ దృష్టికి తీసుకువచ్చారు. గత 12 సంవత్సరాలుగా పతాంజలి యోగ ప్రోటోకాల్ తో పిజెఆర్ స్టేడియంలో ప్రతిరోజు ఉచిత యోగా తరగతి కొనసాగుతుందని తెలిపారు. ప్రతి నెల జీహెచ్ఎంసీ/సీఎంసీకి అభ్యాసకులందరూ విధిగా అద్దె చెల్లిస్తున్నామన్నారు. అయితే అందుకు తగిన సౌకర్యాలు లేవని ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశాను. కావున యోగా ప్రాంగణానికి పై కప్పు నిర్మించాలని, పాములు రాకుండా రక్షణగా చుట్టూ 3 ఫీట్ల ప్రహరీ నిర్మించాలని, అదేవిధంగా యోగా మ్యాట్లు, సౌండ్ సిస్టం, ఇతరత్రా విలువైన పరికరాలను భద్రపరుచుకోవడానికి రెండు గదులను సైతం నిర్మించి ఇవ్వాలని, షెడ్డు చుట్టూ ఎండ వెలుతురు గాలి ప్రసరించేలా జాలి(మెష్) ఏర్పాటు చేసి ఇవ్వాలని కోరారు. స్టేడియంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వెంటనే యోగా ప్రాంగణంలోనూ సౌకర్యాలు కల్పించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గాంధీ 11వ తేదీన జోనల్ కమిషనర్ తో సహా సంబంధిత అధికారులతో కలిసి పీజేఆర్ స్టేడియం సందర్శిస్తానని, యోగ అభ్యాసకుల సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యోగాభ్యాసకులు వారిని సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో చందానగర్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రెడ్డి రఘునాథ్ రెడ్డి, యోగాభ్యాసకులు అప్పలనాయుడు, శ్రీనివాసరావు, మహిపాల్ రెడ్డి, పద్మ, సింహాచలం, సురేష్, శంకర్ పటేల్, వెంకటేశ్వరరావు, జ్ఞానేశ్వర్, బాల నాగరాజు, వెంకట్, మంజుల, రేవతి, రమ్య, లీలావతి, చైత్ర తదితరులు పాల్గొన్నారు.

See also  దుర్గామల్లేశ్వర దేవస్థానంలో బాలింతలకు కొత్త సౌకర్యం ప్రారంభం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :