ఏఐహెచ్‌ఆర్‌సీ ఆధ్వర్యంలో నిరుపేద యువతి వివాహం

పులివెందుల, సెప్టెంబర్‌ 6 (జనస్వరం): పులివెందుల పట్టణంలో ఆల్‌ ఇండియా హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఓ నిరుపేద యువతి వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ వరప్రసాద్‌, విలేకరి రమేష్‌ హాజరయ్యారు. వారు నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పెళ్లికొడుకు, పెళ్లికూతురు కుటుంబ సభ్యులు, బంధువులు, అతిథులకు స్వయంగా బిర్యానీ వడ్డించి సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా సమాజ సేవలో భాగంగా నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఆల్‌ ఇండియా హ్యూమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌ నిర్వాహకులు, సభ్యులను ముఖ్య అతిథులు అభినందించారు.

నిర్వాహకుల ఆధ్వర్యంలో కార్యక్రమం :

ఈ వివాహ కార్యక్రమాన్ని షేక్‌ మహబూబ్‌ పీరా, షేక్‌ మహమ్మద్‌ అక్రం హుస్సేన్‌, షేక్‌ మాబు సుభాన్‌, షేక్‌ మహమ్మద్‌ నజీర్‌, షేక్‌ మహమ్మద్‌ షకీర్‌ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ కార్యనిర్వాహక సభ్యులు షాహుల్‌, షరీఫ్‌, సతీష్‌, వంశీ, రాకేష్‌, కృతిక్‌, జ్ఞాని, రక్షిత్‌, లోకేష్‌ తదితరులు పాల్గొని సేవలందించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తామని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

See also  రాజంపేట జనసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు