సౌదీ అరేబియాలో అంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

రియాద్, సెప్టెంబర్ 11 (జనస్వరం): సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో గల్ఫ్ జనసేన సౌదీ అరేబియా ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు జనసైనికులు, వీర మహిళలు, పార్టీ మద్దతుదారుల సమక్షంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కన్వీనర్ అమీర్ ఖాన్ మాట్లాడుతూ, సౌదీలో సమ్మర్ హాలిడేస్ కావడంతో సెలవులకు వెళ్లిన ప్రవాసాంధ్రులు తిరిగి రావడం కోసం వేడుకలను కాస్త వాయిదా వేసి శుక్రవారం 11వ తేదీన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన APNRTS కార్యవర్గంలో GCC రీజియన్ కోఆర్డినేటర్‌గా నియమితులైన ఆనందరాజు గుండుబోగులను, పార్టీకి మద్దతుగా నిలుస్తూ పార్టీ బలోపేతానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త భవానీ శంకర్ భోగినేనిని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా సన్మానించారు. యాకూబ్ ఖాన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, నిబద్ధతతో పాటు రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. ఉషా దుగ్గపు మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన గొప్ప రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్‌ను కొనియాడారు. చేతన యాంకరింగ్‌తో సభను విజయవంతంగా కొనసాగిస్తూ, మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ సేవానిరతిని, సింప్లిసిటీని, పార్టీ సిద్ధాంతాలను సభకు విచ్చేసిన వారికి తెలియజేశారు. భవానీ శంకర్ మాట్లాడుతూ తమ దంపతులను సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేయడంతో పాటు ఎలాంటి సహాయానికైనా సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఆనందరాజు మాట్లాడుతూ APNRT అవసరాన్ని వివరిస్తూ, పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గల్ఫ్ దేశాల్లో పార్టీ పరంగా ఉచితంగా అందిస్తున్న ప్రమాద బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. APNRT కంట్రీ కోఆర్డినేటర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ అందరూ కలిసి పనిచేస్తే పార్టీ బలోపేతం కావడమే కాకుండా ప్రజలకు మరెన్నో సేవలను సమర్థవంతంగా అందించగలమని వివరించారు. షేక్ ఇబ్రహీం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుర్కొన్న ఇబ్బందులను అధిగమించి 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించిన తీరును, రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలను వివరించారు. బాబి నాయుడు, అర్జున్ కరిపేటి, నూర్ ఉద్దీన్, స్వామి, ముజామ్మిల్, ఆనంద్ పోకూరి తదితర వక్తలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ పవన్ కళ్యాణ్ కష్టం, నిస్వార్థ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో APNRT కంట్రీ కోఆర్డినేటర్లు ఎర్రన్న దుగ్గపు, లక్ష్మీ గోప, ఎం. శ్రీనాథ్, కమిటీ సభ్యులు చిన్నా, అంజి, బొమ్మ శ్రీను, సురేష్, నరేష్, ఖాజా ముజామిల్, సాధనాల వెంకట్, వీర మహిళలు, జనసైనికులు, పార్టీ మద్దతుదారులు పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పలువురి ప్రశంసలు అందుకున్న సంపత్ కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. వేడుకలను సమర్థవంతంగా నిర్వహించిన సౌదీ టీమ్‌ను గల్ఫ్ ఇన్‌చార్జ్ కేసరి త్రిమూర్తులు, నేషనల్ కన్వీనర్లు కంచన శ్రీకాంత్, చందక రామదాసు, చంద్ర నాయక్, ఎం. చంద్రశేఖర్, హేమంత్, శ్రీనివాసరావు, అలీ షేక్ తదితర గల్ఫ్ నాయకులు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

See also  షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని రైతులతో కలిసి నిరసన తెలిపిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ రావు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి