మెరకముడిదం గ్రామంలో దళితులకు స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్న వైనం

       విజయనగరం ( జనస్వరం ) : మెరకముడిదం గ్రామంలో స్మశాన వాటిక లేదు. గత 70 80 సంవత్సరాలు నుంచి చెరువుల్లో పాతడం జరుగుతుంది. స్మశాన వాటిక స్థలం కేటాయించాలని జనసేన పార్టీ విజయనగరం జిల్లా ప్రచార కార్యదర్శి రేగిడి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. మూడుసార్లు చీపురుపల్లి నియోజకవర్గంకు మంత్రి అయినా బొత్స సత్యనారాయణ కనీసం మౌలిక వసతులు లేని నియోజకవర్గ దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడలేరని అన్నారు. మినిస్టర్ మెరక ముడదాం మండల జడ్పిటిసిగా ఏకగ్రీవమైన చిన్న శ్రీను మండల ప్రజల్ని నియోజకవర్గ ప్రజల్ని మభ్యపెట్టడమే తప్ప అభివృద్ధి శూన్యం అని అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న దళితవాడలందరికి కూడా స్మశాన వాటిక స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాను. వారం పది రోజుల్లో ప్రకటన చేయకపోతే రిలే నిరాహారదీక్షకి చేపడతానని అన్నారు. 

See also  SGS కళాశాలను ఎయిడెడ్ గా కొనసాగించాలని విద్యార్థుల చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన జగ్గయ్యపేట జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :