ఓ మహాప్రభో… మా దారపర్తి పంచాయతీ గ్రామాలకు రోడ్డు వేయండి !!!

దారపర్తి

       శృంగవరపుకోట ( జనస్వరం ) : ఓ కలెక్టర్ గారు…  మా దారపర్తి పంచాయతీ పరిధిలో వున్న ఊర్లకు రోడ్డు వేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. శృంగవరపుకోట మండలంలో దారపర్తి పంచాయతీ అనుసంధాన గ్రామాల్లో నివశిస్తున్న మహిళలు మంగళవారం తమ పిల్లలను తీసుకుని కొండ దిగుతున్న సమయంలో నానా ఇబ్బందులు గురికావడం జరిగింది. రెండు చేతులతో నమస్కరిస్తూ వేడుకుంటున్నామని కోరారు. ఇప్పటికే స్థానిక నాయకులను, అధికారులను అడిగినా ఫలితం లేదన్నారు. తమ గ్రామాలకు రోడ్డు వేసి తమ కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు. రోడ్డు లేకపోవడం వలన వైద్య, విద్యా వసతులు లేకపోవడం నాన అవస్థలు పడాల్సి వస్తోందని అన్నారు. ఏళ్ళు గడచినా రోడ్డు వేయాలని కోరడం తప్ప మా మోర ఆలకించే నాధుడు లేరని జనసేన నాయకుడు వబ్బిన సత్యనారాయణ గారికి తమ ఆవేదన వ్యక్తం చేసారు. ఆయన స్పందిస్తూ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. 

See also  అంబటి రాంబాబు వ్యాఖ్యలు అర్థరహితమన్న జనసేన నాయకులు కొమ్మిశెట్టి వెంకట సాంబ శివరావు