Logo
Date of Publish : 26 October 2022, 4:46 pm
Editor : Sake Naresh

ఓ మహాప్రభో… మా దారపర్తి పంచాయతీ గ్రామాలకు రోడ్డు వేయండి !!!

       శృంగవరపుకోట ( జనస్వరం ) : ఓ కలెక్టర్ గారు...  మా దారపర్తి పంచాయతీ పరిధిలో వున్న ఊర్లకు రోడ్డు వేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. శృంగవరపుకోట మండలంలో దారపర్తి పంచాయతీ అనుసంధాన గ్రామాల్లో నివశిస్తున్న మహిళలు మంగళవారం తమ పిల్లలను తీసుకుని కొండ దిగుతున్న సమయంలో నానా ఇబ్బందులు గురికావడం జరిగింది. రెండు చేతులతో నమస్కరిస్తూ వేడుకుంటున్నామని కోరారు. ఇప్పటికే స్థానిక నాయకులను, అధికారులను అడిగినా ఫలితం లేదన్నారు. తమ గ్రామాలకు రోడ్డు వేసి తమ కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు. రోడ్డు లేకపోవడం వలన వైద్య, విద్యా వసతులు లేకపోవడం నాన అవస్థలు పడాల్సి వస్తోందని అన్నారు. ఏళ్ళు గడచినా రోడ్డు వేయాలని కోరడం తప్ప మా మోర ఆలకించే నాధుడు లేరని జనసేన నాయకుడు వబ్బిన సత్యనారాయణ గారికి తమ ఆవేదన వ్యక్తం చేసారు. ఆయన స్పందిస్తూ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com