
మదనపల్లి, అక్టోబర్ 16, (జనస్వరం) :
హిందూ పురాణాలు, హిందూ భావాలను అవమానించే వ్యాఖ్యలు చేస్తున్న వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పై వెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ డిమాండ్ చేశారు. శ్రీవారి రక్తం ద్వారా ఎర్రచందనం ఏర్పడిందని పురాణాలు చెప్తుంటే, వాటిని అవమానించే విధంగా భూమన మాట్లాడటం హిందూ సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తోందని ఆయన విమర్శించారు. హిందూ ధర్మంపై దాడులు పెరుగుతున్న తరుణంలో అన్ని హిందూ సంఘాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని మహేష్ పిలుపునిచ్చారు. హిందూ దేవుళ్లను, పురాణాలను అవమానించే వ్యక్తులను ప్రోత్సహించే పార్టీలను ప్రజలు బహిష్కరించాల్సిన సమయం ఇది అని పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డిని వైఎస్సార్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే, ఆ పార్టీ కావాలనే హిందూ భావాలను దెబ్బతీయాలని చూస్తోందని హిందూ సమాజం భావించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అన్ని హిందూ సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని త్వరలో మదనపల్లి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నట్టు మహేష్ తెలిపారు. ఈ సమావేశానికి విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్‌దళ్‌తో పాటు ఇతర హిందూ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్నట్టు చెప్పారు. భూమనపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.








