కుక్కునూరు మండలంలో ఇసుక రాంపులకు గిరిజన సొసైటీలకు అనుమతి – కఠిన నిబంధనలు అమలు

కుక్కునూరు, మార్చి 30 (జనస్వరం) : కుక్కునూరు మండల పరిధిలోని దాచారం మరియు ఇబ్రహీంపేట ఇసుక రాంపులను మైనింగ్ శాఖ గిరిజన సొసైటీలకు నిర్వహణ కోసం అనుమతి ఇచ్చింది. ఈ రాంపుల నుండి తీసుకునే ఇసుకను కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే తరలించాల్సి ఉంటుంది. ఇసుక రవాణా మరియు రాంపుల నిర్వహణకు ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రాంపుల పర్యవేక్షణతో పాటు, ఇసుకను తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలించకుండా నివారించేందుకు పోలీస్ మరియు రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో పికెట్లు ఏర్పాటు చేశారు. మైనింగ్ శాఖ నిర్దేశించిన అన్ని నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ రాంపుల నిర్వహణ చేపట్టాలని అధికారులు సూచించారు. ఏ విధమైన ఉల్లంఘనలు జరిగిన పక్షంలో సంబంధిత గిరిజన సొసైటీలపై మరియు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

See also  నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి నిరసనగా ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ నిరసన ర్యాలీ