Logo
Date of Publish : 16 November 2025, 5:46 pm
Editor : Sake Naresh

భూమన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మైఫోర్స్ మహేష్ డిమాండ్

మదనపల్లి, అక్టోబర్ 16, (జనస్వరం) :
హిందూ పురాణాలు, హిందూ భావాలను అవమానించే వ్యాఖ్యలు చేస్తున్న వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి పై వెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ డిమాండ్ చేశారు. శ్రీవారి రక్తం ద్వారా ఎర్రచందనం ఏర్పడిందని పురాణాలు చెప్తుంటే, వాటిని అవమానించే విధంగా భూమన మాట్లాడటం హిందూ సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తోందని ఆయన విమర్శించారు. హిందూ ధర్మంపై దాడులు పెరుగుతున్న తరుణంలో అన్ని హిందూ సంఘాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని మహేష్ పిలుపునిచ్చారు. హిందూ దేవుళ్లను, పురాణాలను అవమానించే వ్యక్తులను ప్రోత్సహించే పార్టీలను ప్రజలు బహిష్కరించాల్సిన సమయం ఇది అని పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డిని వైఎస్సార్సీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే, ఆ పార్టీ కావాలనే హిందూ భావాలను దెబ్బతీయాలని చూస్తోందని హిందూ సమాజం భావించే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అన్ని హిందూ సంఘాల‌తో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని త్వరలో మదనపల్లి జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నట్టు మహేష్ తెలిపారు. ఈ సమావేశానికి విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్‌దళ్‌తో పాటు ఇతర హిందూ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్నట్టు చెప్పారు. భూమనపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com