అగ్ని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు గెడ్డం బుజ్జి

గెడ్డం బుజ్జి

          పాయకరావుపేట ( జనస్వరం ) : పాయకరావుపేట మండలంలోని పాల్మన్ పేట పంచాయతీ కొర్లయ్యపేట గ్రామాల్లో సూరడ కొండమ్మ, రాంబాబు ఇంటిలో వంట గ్యాస్ లీక్ అవడంతో మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అదే గ్రామానికి చెందిన స్థానిక జనసేన నాయకులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.  గెడ్డం బుజ్జి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం బుజ్జి ఆ కుటుంబానికి 5000 నగదు, మరియు 25 కేజీలు బియ్యం, నిత్యావసరకులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

See also  జగ్గయ్యపేటలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర - పోస్టర్ ఆవిష్కరణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి