జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన తాడేపల్లిగూడెం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్

జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన తాడేపల్లిగూడెం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్

            పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలో ఇటీవల క్యాన్సర్‌ వ్యాధితో మరణించిన జన సైనికుడు దాసం జయచంద్ర కుటుంబాన్ని పరామర్శించిన జనసేన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. అతి చిన్న వయసులో క్యాన్సర్‌ వ్యాధితో మరణించడం చాలా బాధాకరమని వారి కుటుంబానికి జనసేన కుటుంబం అండగా ఉంటుందని బొలిశెట్టి శ్రీనివాస్‌ అన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దాసం జయచంద్ర కుటుంబానికి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండలం జనసేన అధ్యక్షులు పుల్లాబాబి, అధికార ప్రతినిధి కొనగల హరనాథ్‌, మండల కార్యదర్శి ఆకుల నాని, గూడెం జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తన పల్లి కాశి, కోశాధికారి గుండు మోగుల సురేష్‌ కార్యదర్శి మద్దాల మణికుమార్‌, ఆకుతీగ పాదుగ్రామ జనసైనికులు పాల్గొన్నారు.

See also  వరదల వలన నష్టపోయిన వరి రైతులను ప్రభుత్వము ఆదుకోవాలి : జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి