
రియాద్, ఫిబ్రవరి 12, (జనస్వరం) : సౌదీ అరేబియాలో గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాటలతో పాటు “జేఎస్పీ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026”ను నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగ ప్రతినిధులు, క్రీడాకారులు భారీగా పాల్గొన్నారు. గెలుపు–ఓటములకంటే క్రీడాస్ఫూర్తి ముఖ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలుగు సమాజాన్ని ఐక్యంగా నిలబెట్టే దిశగా ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రెసిడెంట్ మురారి తెలిపారు. ఈ టోర్నమెంట్‌ను నిర్వహించిన ప్రెసిడెంట్ మురారి, ఈవెంట్ ఇంచార్జ్ ఇబ్రహీం, మహిళా విభాగ నాయకురాలు మనుశ్రీ, మహిళా వింగ్ అధ్యక్షురాలు చేతన, ఇంచార్జ్ ఉషా, రియాద్ సిటీ ప్రెసిడెంట్ రమ్య, ఉపాధ్యక్షులు రమా కుమారి, సాయి దుర్గా తదితరులను సౌదీ కన్వీనర్ అమీర్ ఖాన్ అభినందించారు. కోర్ట్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు నాగవర ప్రసాద్ నిర్వహించగా, జనరల్ సెక్రటరీ సీతారాం, సెక్రటరీ రావూరి శ్రీను, కల్చరల్ ప్రోగ్రామ్ అడ్వైజర్ నైదన మహేష్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. పార్టీ వైస్ ప్రెసిడెంట్ యాకూబ్ ఖాన్, ఫైనాన్స్ ఎర్రన్న, వెల్ఫేర్ ఆనందరాజు, యోగి బాబు, గురు కిరణ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మధు, లోకేష్ తదితరులు హాజరయ్యారు. రిఫరీగా ముఖేష్ బద్రి వ్యవహరించగా స్వామి మరియు SATA సెంట్రల్ సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి జేఎస్పీ బృందం కృతజ్ఞతలు తెలియజేసి వచ్చే సంవత్సరం మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.









