ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు మానుకోవాలి : బీజేపీ నేత దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి

              బీజేపీ నేత దుద్దకుంట వెంకటేశ్వర రెడ్డి పత్రికాముఖంగా మాట్లాడుతూ దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ విస్తరిస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ వ్యాధి అదుపులో ఉన్నప్పటికీ కూడా దేశంలోని కాంగ్రెస్ మరియు కమ్యూనిస్టు పార్టీలు దీన్ని రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారిపై విమర్శలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. దేశం అదే విధంగా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వ్యాధి నివారణకు సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప రాజకీయ పార్టీలు ఇదే అదనుగా రాజకీయాలు మాట్లాడడం తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దిగజారుడు రాజకీయాలు తప్ప మరేమీ కాదు.
              కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదు దీనికి బాధ్యత ఆయా పార్టీలు తీసుకుంటుయా ఆని భారతీయ జనతాపార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విదేశాలతో వ్యవహరిస్తున్న తీరు వారి విదేశాంగ విధానం వల్ల ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా భారత దేశం పట్ల స్నేహ భావాన్ని ప్రదర్శిస్తూ సహాయం చేయడానికి ముందుకు వస్తున్న తీరును మనమందరమూ కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే పోయి ఇటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడటం సరైంది కాదు. ప్రధాన మంత్రి గారి రాజకీయ దక్షత వారి పరిపాలన సమర్థత వల్ల ఈరోజు విదేశాల నుండి యుద్ధప్రాతిపదికన యుద్ధ విమానాలు ద్వార ఆక్సిజన్ భారతదేశానికి తరలిస్తున్న తీరు ప్రపంచ వ్యాప్తంగా నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని భారతదేశాన్ని అందరూ అభినందిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను కొనియాడుతున్నది. కేంద్ర ప్రభుత్వం సేకరించిన కరోనా టీకాలను, ఉచితంగానే రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రెండు టీకాలను రూ.150 చొప్పున కొనుగోలు చేసి, అని రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు టీకాలను కేంద్రం ఉచితంగానే అందిస్తుంది. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం “ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన” పథకం ద్వార 80 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగే రూ. 26 వేల కోట్ల విలువైన ఆహార ధాన్యాలను ఉచితంగా రానున్న రెండు నెలల్లో పంపిణీ. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇటువంటి చర్యల వలన ఆకలితో ఉన్న అదేవిధంగా ఆపదలో ఉన్న దేశ ప్రజలకు స్వాంతన తప్ప మరేమీ కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాట్లాడటం విమర్శలు చేయటం మానుకోవాలని భారతీయ జనతా పార్టీ వారికి విజ్ఞప్తి చేస్తున్నదని అన్నారు. 

See also  ముంచుతారా.. తేలుస్తారా..? - త్యాడ రామకృష్ణారావు (బాలు)