Logo
Date of Publish : 14 February 2026, 1:30 pm
Editor : Sake Naresh

సౌదీ అరేబియాలో ఘనంగా జనసేన ఆవిర్భావ వేడుకలు, క్రీడలు ఏర్పాటు

రియాద్, ఫిబ్రవరి 12, (జనస్వరం) : సౌదీ అరేబియాలో గల్ఫ్ సేన జనసేన ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాటలతో పాటు “జేఎస్పీ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026”ను నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగ ప్రతినిధులు, క్రీడాకారులు భారీగా పాల్గొన్నారు. గెలుపు–ఓటములకంటే క్రీడాస్ఫూర్తి ముఖ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. తెలుగు సమాజాన్ని ఐక్యంగా నిలబెట్టే దిశగా ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రెసిడెంట్ మురారి తెలిపారు. ఈ టోర్నమెంట్‌ను నిర్వహించిన ప్రెసిడెంట్ మురారి, ఈవెంట్ ఇంచార్జ్ ఇబ్రహీం, మహిళా విభాగ నాయకురాలు మనుశ్రీ, మహిళా వింగ్ అధ్యక్షురాలు చేతన, ఇంచార్జ్ ఉషా, రియాద్ సిటీ ప్రెసిడెంట్ రమ్య, ఉపాధ్యక్షులు రమా కుమారి, సాయి దుర్గా తదితరులను సౌదీ కన్వీనర్ అమీర్ ఖాన్ అభినందించారు. కోర్ట్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు నాగవర ప్రసాద్ నిర్వహించగా, జనరల్ సెక్రటరీ సీతారాం, సెక్రటరీ రావూరి శ్రీను, కల్చరల్ ప్రోగ్రామ్ అడ్వైజర్ నైదన మహేష్ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. పార్టీ వైస్ ప్రెసిడెంట్ యాకూబ్ ఖాన్, ఫైనాన్స్ ఎర్రన్న, వెల్ఫేర్ ఆనందరాజు, యోగి బాబు, గురు కిరణ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మధు, లోకేష్ తదితరులు హాజరయ్యారు. రిఫరీగా ముఖేష్ బద్రి వ్యవహరించగా స్వామి మరియు SATA సెంట్రల్ సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి జేఎస్పీ బృందం కృతజ్ఞతలు తెలియజేసి వచ్చే సంవత్సరం మరిన్ని క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com