డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్దంతి సందర్భంగా నెల్లూరు జనసేనపార్టీ తరపున నివాళులు

అంబేద్కర్

        నెల్లూరు ( జనస్వరం ) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారి ఆధ్వర్యంలో విఆర్సీ కూడలి నందు గల వారి విగ్రహానికి మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అంటరానితనం కుల వ్యవస్థ రాజ్యమేలుతున్న రోజుల్లో తాను ఎదుర్కొన్న వివక్షను రానున్న తరాలు ఎదుర్కోకూడదని ఒక ఆశయంతో పరిస్థితులకు ఎదురీది ఉన్నత శిఖరాలను అధిరోహించి భారతావనికి రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహాపురుషుని స్మరిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తాం. అభివృద్ధి ఫలాలు అన్ని కులాలకు అందే విధంగా అందాలి అనే నినాదాన్ని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు నిజం చేస్తారని ఒకసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు.. ఎన్నో తరాలుగా మహనీయులు కులవివక్షను రూపు మార్చడానికి ఎంతో కృషి చేసిన ఇప్పటికీ మన మధ్యలో కులచిచ్చు రగిలిస్తూనే ఉన్నారు. ఆర్థిక అసమానతలతో ప్రజలు తల్లడిల్లుతూనే ఉన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని కులాలకే పరిమితమైన రాజ్యాధికారాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇస్తే అన్ని వర్గాల వారికి అందే విధంగా చేస్తారని,జనసేన పార్టీ తరఫున ఒకసారి మద్దతు ఇవ్వాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో కార్యదర్శులు పూసల మల్లేశ్వరరావు,మడపర్తి ప్రశాంత్, జనసేన నాయకులు అనుదీప్ రెడ్డి, కంథర్, అమీన్, షాజహన్, అలేఖ్, రాజా, ఇంతియాజ్, అమీన్ తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జనసైనికుడికి ఆర్థిక సాయం అందించిన నూజివీడు జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి