Logo
Date of Publish : 07 December 2022, 8:03 am
Editor : Sake Naresh

డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్దంతి సందర్భంగా నెల్లూరు జనసేనపార్టీ తరపున నివాళులు

        నెల్లూరు ( జనస్వరం ) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గారి ఆధ్వర్యంలో విఆర్సీ కూడలి నందు గల వారి విగ్రహానికి మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంటరానితనం కుల వ్యవస్థ రాజ్యమేలుతున్న రోజుల్లో తాను ఎదుర్కొన్న వివక్షను రానున్న తరాలు ఎదుర్కోకూడదని ఒక ఆశయంతో పరిస్థితులకు ఎదురీది ఉన్నత శిఖరాలను అధిరోహించి భారతావనికి రాజ్యాంగాన్ని అందించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహాపురుషుని స్మరిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తాం. అభివృద్ధి ఫలాలు అన్ని కులాలకు అందే విధంగా అందాలి అనే నినాదాన్ని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు నిజం చేస్తారని ఒకసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు.. ఎన్నో తరాలుగా మహనీయులు కులవివక్షను రూపు మార్చడానికి ఎంతో కృషి చేసిన ఇప్పటికీ మన మధ్యలో కులచిచ్చు రగిలిస్తూనే ఉన్నారు. ఆర్థిక అసమానతలతో ప్రజలు తల్లడిల్లుతూనే ఉన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని కులాలకే పరిమితమైన రాజ్యాధికారాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇస్తే అన్ని వర్గాల వారికి అందే విధంగా చేస్తారని,జనసేన పార్టీ తరఫున ఒకసారి మద్దతు ఇవ్వాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో కార్యదర్శులు పూసల మల్లేశ్వరరావు,మడపర్తి ప్రశాంత్, జనసేన నాయకులు అనుదీప్ రెడ్డి, కంథర్, అమీన్, షాజహన్, అలేఖ్, రాజా, ఇంతియాజ్, అమీన్ తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com