
డా. అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు నేషనల్ హెల్త్ అథారిటీ గుర్తింపు
నరసరావుపేట, జూలై 10( జనస్వరం)
నరసరావుపేట లోని డా. అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వ నేషనల్ హెల్త్ అథారిటీ (National Health Authority – NHA) ఆధ్వర్యంలో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) కింద హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (Health Facility Registry – HFR)లో ఆసుపత్రి అధికారికంగా నమోదు చేయబడింది.ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా డిజిటల్ ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ లో భాగంగా తమ ఆసుపత్రికి ఈ గుర్తింపు లభించడం గర్వకారణమని తెలిపారు.ఈ రిజిస్ట్రేషన్ ద్వారా ఆసుపత్రి డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ లో భాగమై, పారదర్శకమైన, నాణ్యమైన మరియు సాంకేతికత ఆధారిత వైద్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు అవకాశం కలిగిందన్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తున్న వైద్యులు, సిబ్బంది మరియు ప్రజలందరికీ ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. భవిష్యత్తులో మరింత ఆధునిక వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు కట్టుబడి ఉంటామని డా.అంజిరెడ్డి గ్రూపు చైర్మన్ డా. లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు పరిపాలన అధికారి పరిటాల సత్యనారాయణ పేర్కొన్నారు.








