
శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి ఊలుతో విశేష అలంకరణ
శాస్త్రీయంగా ప్రారంభమైన 12వ వార్షికోత్సవం
వేదాంతం రమణాచార్యులు ఆధ్వర్యంలో విశేష పూజలు, అలంకరణ
సత్తెనపల్లి,మే 01 (జనస్వరం)
పట్టణంలోని నాగన్నకుంట 22వ వార్డ్ లో వేంచేసి యున్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానం 12వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం అనగా 30-04-2026 నుండి 03-05-2026 ఆదివారం వరకు 4 రోజులు విశేష పూజలను వేదాంతం రమణాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించు చున్నారు.ఈ సందర్భంగా మొదటి రోజైనా గురువారం చతుర్దశి పుణ్య తిధిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారికి “ఊలుతో” అలంకరణ గావించారు. ఈ సందర్భంగా స్వామివారికి సహస్ర నాగవల్లీ దళార్చన పూజా కార్యక్రమం నిర్వహించారు. నారాయణ సేవ నగర సంకీర్తన బృందం వారిచే భజన కార్యక్రమం, గీతాలాపన గావించారు.ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది భక్తులు పాల్గొన్నట్లు ఆలయ అర్చకులు వేదాంతం రమణాచార్యులు వెల్లడించారు.అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.








