Logo
Date of Publish : 09 July 2026, 9:20 pm
Editor : Sake Naresh

నేషనల్ హెల్త్ అథారిటీ గుర్తింపు పొందిన డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

డా. అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు నేషనల్ హెల్త్ అథారిటీ గుర్తింపు
నరసరావుపేట, జూలై 10( జనస్వరం)
నరసరావుపేట లోని డా. అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. భారత ప్రభుత్వ నేషనల్ హెల్త్ అథారిటీ (National Health Authority - NHA) ఆధ్వర్యంలో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) కింద హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (Health Facility Registry - HFR)లో ఆసుపత్రి అధికారికంగా నమోదు చేయబడింది.ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా డిజిటల్ ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ లో భాగంగా తమ ఆసుపత్రికి ఈ గుర్తింపు లభించడం గర్వకారణమని తెలిపారు.ఈ రిజిస్ట్రేషన్ ద్వారా ఆసుపత్రి డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌ లో భాగమై, పారదర్శకమైన, నాణ్యమైన మరియు సాంకేతికత ఆధారిత వైద్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించేందుకు అవకాశం కలిగిందన్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తున్న వైద్యులు, సిబ్బంది మరియు ప్రజలందరికీ ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. భవిష్యత్తులో మరింత ఆధునిక వైద్య సేవలను ప్రజలకు అందించేందుకు కట్టుబడి ఉంటామని డా.అంజిరెడ్డి గ్రూపు చైర్మన్ డా. లోకిరెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు పరిపాలన అధికారి పరిటాల సత్యనారాయణ పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com