కళ్యాణదుర్గంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు గురించి అవగాహన

కళ్యాణదుర్గం

      అనంతపురం ( జనస్వరం ) : కళ్యాణదుర్గం మండలంలో విట్లంపల్లి గ్రామంలో అనంతపురం జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, కళ్యాణదుర్గం మండలం అధ్యక్షుడు షేక్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గురించి వివరించి క్రియాశీలక కరపత్రాలు ఇవ్వడం జరిగింది. సామాన్య ప్రజలకు జనసేన సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరిస్తూ జనసేనపార్టీ ఆవశ్యకతను వివరించడం జరిగింది. గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ధనుంజయ్ మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మండల సంయుక్త కార్యదర్శి వెంకటేశు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

See also  అంగన్వాడీ సమ్మెకు మద్దతు తెలిపిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ