డంపింగ్‌యార్డును తరలించాల్సిందే

    పాలకొండ ( జనస్వరం ) : నగర పంచాయతీ 20వ వార్డు పరిధి తెలుకవాని చెరువు గట్టుపై తాత్కాళికం పేరుతో ఏర్పాటు చేసిన డంపింగ్‌యార్డును తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం మూడు వార్డు ప్రజలు ర్యాలీగా నగర పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు గర్భాన సత్తిబాబు, టిడిపి పట్టణ అధ్యక్షులు గంటా సంతోష్, సిఐటియు నాయకులు దావల రమణ, బిజెపి పట్టణ అధ్యక్షులు, కారేపు చిట్టిబాబు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

See also  28న ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం రండి.. కదలిరండి : కొలసాని లక్ష్మీ పిలుపు