దళిత మైనర్ బాలికను అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి : మాదాసు మురళీ

మాదాసు మురళీ

        ప్రొద్దుటూరు ( జనస్వరం ) : పట్టణంలోని అమృతనగర్ చెందిన దళిత మైనర్ బాలిక అత్యాచారం జరిపి గర్భవతి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళీ డిమాండ్ చేసారు. మాదాసు మురళీ మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో ఎక్కడ మహిళలకు రక్షణ కరువైందన్నారు. అత్యాచారనికి గురై గర్భవతి అయిన దళిత బిడ్డకు న్యాయం చేయాలని ఈ అత్యాచారానికి పాల్పడినవారిని పోలీసులు గుర్తించి వారిపై SC, ST అట్రాసిటి కేసుతో పాటు, ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని డిమండ్ చేశారు. అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. భాదిత కుంటుంబానికి న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ తరుపున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

See also  మృత్యుఘోష వినబడదా? జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర, మద్దతు తెలిపిన బీజేపీ