విజయనగరం జనసేనపార్టీలో భారీ చేరికలు

  విజయనగరం ( జనస్వరం ) :  విజయనగరం పాల్ నగర్ దగ్గర ఉన్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో గాజులరేగ జనసేన పార్టీ నాయకుల సమక్షంలో 150 మందికి పైగా సభ్యులు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. కార్యక్రమ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో యశస్వి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరు మీ మీ డివిజన్లో ప్రతి ఒక్కరు బూత్ కమిటీ స్థాయి నుండి ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు సాధనకే ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జనసైనికులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

See also  కాకినాడ నియోజకవర్గంలో SC, ST సబ్ ప్లాన్ పై అవగాహనా సదస్సు