కాకినాడ నియోజకవర్గంలో SC, ST సబ్ ప్లాన్ పై అవగాహనా సదస్సు

     కాకినాడ, (జనస్వరం) : కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుదురు గ్రామం హరిజన పేటలో జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గంట నానీబాబు అధ్యక్షతన SC, ST సబ్ ప్లాన్ పై అవగాహనా సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం SC, ST సబ్ ప్లాన్ ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తోందో, వారికీ గల 27 పథకాలను అందకుండా రద్దు చేసిందో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు, యువత, కరప మండల జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

See also  వైకాపా పాలనలో మత్స్యకారులకు తీరని అన్యాయం : జనసేన పార్టీ మత్స్యకార వికాస కమిటీ ఛైర్మన్ బొమ్మిడి నాయకర్