ఆకుతోటపల్లిలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం

అనంతపురం రూరల్, ఆగస్టు 10 (జనస్వరం): రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రీరల్స్ కాలనీ, రాజీవ్ గాంధీ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 110, 111, 112 బూత్‌ల పరిధిలో దాదాపు 100 ఇళ్లను నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ రాగే మురళీమోహన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పూల నారాయణస్వామి, యూనిట్ ఇన్‌చార్జ్ సూర్యప్రకాశ్, డీసీ బాబు, పూల నాగరాజు, రాప్తాడు గణేష్, మేకల నవీన్ గౌడ్, గుంజర జయరాములు, గుంజర రవి, లక్ష్మీపతి, బలరాముడు, శివయ్య, ఆదినారాయణ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  పామిడిలో బంద్ కు జనసేన మద్దతు