మదనపల్లి ( జనస్వరం ) : విశాఖపట్నంలో జరగబోయే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అడ్డుకుంటే రాష్ట్ర అగ్నిగుండం అవుతుందని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ హెచ్చరించారు. గురువారం మైఫోర్స్ మహేష్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్యారెక్టర్ లేని అంబోతు అంబటి రాంబాబు, గట్కా కొడాలి నాని, ఉమ్మడి చిత్తూరు జిల్లా మంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుతో తలదించుకునే రోజా, క్యారెక్టర్ లేని అమరనాథ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, చిరంజీవి విమర్శించే స్దాయి మీది కాదని, చిరంజీవి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల ఎంతో సహనంతో వున్నా అనవసరంగా రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ సూచించారు. పవన్ కళ్యాణ్ తో పెట్టుకోవడం ప్రభూత్వ పతనానికి నాంది అన్నారు. వైజాగ్ లో వారాహి యాత్ర అడ్డుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. తాగి ఊగే రోజా వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో వీర మహిళలు మల్లిక, సునీత, శోభ, రూప, శ్రీనాథ్, రమణ, అప్సర్, సల్మాన్, దేవ, లక్ష్మీపతి, ప్రశాంత్, పవన్ తదితరాలు పాల్గొన్నారు.