‘యువశక్తి’ ని విజయవంతం చేయాలి : గజపతినగరం జనసేన నాయకులు మర్రాపు సురేష్

యువశక్తి

          గజపతినగరం ( జనస్వరం ) : ఈ నెల 12న జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న యువశక్తి సభను విజయవంతం చేయాలని జనసేనపార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ మరియు యువశక్తి ప్రచారకర్త బొల్లి శెట్టి శ్రీనివాస్  పిలుపునిచ్చారు. మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో స్ధానిక గజపతినగరం మండలం మరుపల్లి గ్రామంలో కళాశాలలో విద్యార్థిని విద్యార్థులతో సమావేశం నిర్వహించి యువ శక్తి సభ గురించి వివరించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర యువత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర వెనుకుబాటుతనం పోగొట్టడానికి, యువతలో చైతన్యం తెచ్చేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ యువశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మర్రాపు సురేష్ మాట్లాడుతూ సీఎం జగన్‌ పరిపాలనా వైఫల్యంతో యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నదని, కొందరు యువకులు గంజాయికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయడం లేదన్నారు. మూడు రాజధానుల పేరుతో విశాఖలోని భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు, శ్రీమతి పాలవలస యశస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం ఇంచార్జ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా మోసంచేసిందన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల సభలను అడ్డుకునేందుకే ఆంక్షలు విధిస్తూ జీఓ విడుదల చేశారని ఆమె ఆరోపించారు. యువశక్తి కార్యక్రమం అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ఫలితం ఉండదని తెలిపారు. పార్టీ నాయకులు మరియు మీడియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు డా.రవికుమార్ మిడతాన మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమానికి యువతీ యువకులను సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వలసలు, ఉపాధి లేమి, విద్యావకాశాలు, వ్యాపార అవకాశాలు వంటి అన్నీ అంశాలపై సమగ్రంగా యువత అభిప్రాయాలు తెలియజేసేందుకు యువశక్తి కార్యక్రమం వేదిక అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మన యువత, మన భవిత, అనేదే ప్రధాన నినాదంగా యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. ఈ సమావేశంలో పార్టీ మరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గారు, రాష్ట్ర కార్యదర్శి శివ దత్త గారు అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాము, గొర్లి ఆదినారాయణ, పండు, ఆదినారాయణ, మహేష్, లక్ష్మణ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

See also  నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ నూతన కేంద్ర కార్యాలయం శంకుస్థాపన

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి