జనసేనపార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మర్రిపాడు మండల అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి

      అనంతసాగరం, (జనస్వరం) : పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ పార్టీ సిద్ధాంతాల్ని  పల్లెల్లో సైతం తీసుకెళదామని మర్రిపాడు మండల జనసేన అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి అన్నారు. పల్లె పల్లెకు జనసేన పార్టీ సిమెంట్ బెంచిలు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనంతసాగరంమండల జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి కాకి జాషువా ఆధ్వర్యంలోపెన్నా కృష్ణా_రీజనల్ కమిటీ కో ఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి గారి సహాయ సహకారంతో జనసేన పార్టీ సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మర్రిపాడు మండల అధ్యక్షురాలు ప్రమీలా ఓరుగంటి, వీరమహిళలు, పెనగలూరు చంద్రకళ, ప్రవళక చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం అనంతసాగరంమండల అధ్యక్షులు మహబూబ్ మస్తాన్ మాట్లాడుతూ భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కాకి జాషువా, మర్రిపాడు మండల ప్రధాన కార్యదర్శి గంటా అంజి, కలువాయి మండల నాయకులు నరేష్ అనంతసాగరంమండల జనసైనికులు మంగళ పెంచలయ్య, పెంచల రావు, విజయ్, పెనగలూరు చిన్నయ్య, యశ్వంత్, చిన్నా జనసేన తదితరులు పాల్గొన్నారు.

See also  ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు జనసైనికులు సిద్ధం కండి...?