
అనంతపురం, మార్చి 13, పెన్నా టైమ్స్ : రాప్తాడు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పేరూరు కురుబ నాగిరెడ్డి (అడ్వకేట్) హాజరయ్యారు. పార్టీ 16వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో రాప్తాడు మండల కన్వీనర్ మరూరు సాకే వెంకటేష్ మరియు యూత్ మండల కన్వీనర్ గొల్లపల్లి విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు “జై జగన్” అంటూ నినాదాలు చేస్తూ ఆనందంగా వేడుకలను జరుపుకున్నారు. అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, మాజీ కన్వీనర్లు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








