యువతా మేలుకో – జనసేన సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న జనసేన నాయకులు సిద్ధు

జనసేన

          కావలి ( జనస్వరం ) : జనసేన యువ నాయకుడు సిద్దు గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని బిట్రగుంటలో యువతా మేలుకో అనే కార్యక్రమమును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దు గారు మాట్లాడుతూ ప్రతి యువకుడు అంబేద్కర్ ఆశయాలను చేగువేరా పోరాట స్ఫూర్తితో తమ హక్కుల కోసం గ్రామంలోని సమస్యల మీద చాలా గట్టిగా ప్రశ్నించి పోరాడి సాధించుకోవాలి అని తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లో అవినీతి అరాచకాలు లేనటువంటి యువతకు ఉపాధి చూపించి అభివృద్ధి చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీగా యువకులు పాల్గొనడం జరిగింది. 

See also  తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టం పరిహారం చెల్లించాలి : రామచంద్రపురం జనసేనపార్టీ ఇంఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి