తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టం పరిహారం చెల్లించాలి : రామచంద్రపురం జనసేనపార్టీ ఇంఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్

      రామచంద్రపురం, (జనస్వరం) :  రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం సుందరపల్లి, ఊడిమూడి, తామరపల్లి గ్రామాలలో అకాల వర్షాల కారణంగా పూర్తిగా వరి పంటలు దెబ్బతిన్నాయి. రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ వెళ్లి పంటపొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం రైతుల సమస్యలను, రైతుల యెుక్క ఆవేదను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ ప్రభుత్వం స్పందించి తక్షణమే నష్టపోయిన రైతులుకు  నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో సుందరపల్లి, ఊడిమూడి, తామరపల్లి గ్రామాల జనసేన పార్టీ MPTC తాడాల జానకి రామ్ గారు, జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీను గారు, కోటిపల్లి వీరప్రసాద్ గారు, అక్కిరెడ్డి శ్రీను గారు, రాంబాబు గారు, రాజ్ కుమార్ గారు, సుందరపల్లి, ఊడిమూడి, తామరపల్లి గ్రామాల జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

See also  ఆధునీకరణ పేరుతో మూత పడ్డ భీమసింగి చక్కెర కర్మాగారం మూత