కనీసం రోడ్లు కూడా వెయ్యలేని వాళ్లు ప్రాజెక్ట్ లు నిర్మిస్తారా ? : ఆలూరు జనసేన ఇంచార్జ్ వెంకప్ప

ఆలూరు

             కర్నూలు ( జనస్వరం ) : ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్  తెర్నెకల్ వెంకప్ప ఆలూరు నుంచి అరికెరతండా, చిప్పగిరి, హత్తిబెలగల్ రహదారులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి  గుమ్మనూరు జయరాం పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం అని మీరు చెప్పుకుంటూ ఉంటారు. కనీసం పాతికేళ్ళ వయసు గల యువత మాటైనా వినగలరా ? అని దయ్యబట్టారు. ప్రజలు మరియు యువత నియోజకవర్గ పాలకుల పైన విరక్తి చెంది ఉన్నారన్నారు. గ్రామాలకు సరిగ్గా రోడ్లు కూడా వేయలేని వారు జిల్లాకు ఒక విమానాశ్రయం కట్టిస్తామని చెప్పడం ప్రజల్ని మభ్యపెట్టడమే అని హితువు పలికారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ దశాబ్దాలు గడుస్తున్నా మా రోడ్ల పరిస్థితి మారట్లేదని వాపోయారు. ఎంతో మంది పాలకులు వస్తున్నారు, పోతున్నారు కానీ మా జీవితాలు మాత్రం ఆగమ్యగోచరంగా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రంజిత్, చత్రపతి, మహేష్, మక్బుల్, నందు, ఆంటోనీ, నాగరాజు, సోమశేఖర్ పాల్గొన్నారు.

See also  మహనీయుల ఆశయాలే నేటి యువతకు మార్గదర్శకం: డా. ఒమ్మి రఘురామ్