నిన్ను ఎందుకు నమ్మాలి సీఎం జగన్ రెడ్డి

జగన్ రెడ్డి

     విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయనగరం జిల్లా నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, మే 3న ముఖ్యమంత్రి YS జగన్ రెడ్డి విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రాయ శంకుస్థాపనకు రావడం సిగ్గు చేటని, ఇంతకుముందే శంకుస్థాపన జరిగిన తరువాత మళ్ళీ అదే పనికోసం అదేచోట ఈయన శంకుస్థాపన కోసం రావడం విడ్డూరం కాకపోతే మరేమిటని జిల్లా నాయకులు ఏద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రి కేవలం శంకుస్థాపనల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారని, కేవలం బటన్ నొక్కుడు ముఖ్యమంత్రిని రాబోయే ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. ముఖ్యమంత్రి ఇకనైనా తీరు మార్చుకుని అనవసరమైన అర్భాటాలకు పోకుండా, ప్రజల సొమ్మును వృధా చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్మాణ కార్యదర్శి బాబు పాలూరి, జిల్లా నాయకులు మర్రాపు సురేష్, ఆదాడ మోహన రావు, అక్కివరపు మోహన్ రావు, గుర్రన్న అయ్యలు , మిడతాన రవి కుమార్,రమేష్ రాజు, నర్సింగ్ రావు, టమ్మిగంటి సురి నాయుడు, అడ్డాల రామచంద్ర రాజు, రేగిడి లక్ష్మణరావు, తుమ్మి అప్పలరాజు దొర, బాలు, తవిటీ నాయుడు,రాజేష్ పాల్గొన్నారు

See also  అందరి చూపు పవనన్న వైపే : పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి