
కృష్ణా, (జనస్వరం) : రైతు ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం కేవలం మాటలు, అంకెల గారడి, పేపర్ యాడ్స్ కి తప్పా! ఏ విధంగా అన్నం పెట్టే రైతన్నలను ఆదుకుంటుంది అని కిషోర్ కుమార్ పత్రిక ముఖంగా తెలియచేసారు. జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామానికి చెందిన షేక్ కరీం సాహెబ్ అనే కౌలు రైతు అప్పు తెచ్చుకుని తన కష్టంతో పంట పండించుకుని తొమ్మిది నెలల క్రితం సుమారుగా 90 క్వింటాలు మొక్కజొన్న పంటను ప్రభుత్వ మార్కెట్ యార్డుకి అమ్మిన తాలూకా లక్ష యాభై వేల రూపాయలు డబ్బులు రాకపోవటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. మరి గతంలో కూడా ఇదే గ్రామానికి చెందిన సత్య అనే రైతు కూడా అనేక కారణాల చేత ఆత్మహత్య చేసుకున్నారు అని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరుపున ఒకటే ప్రశ్నిస్తున్నాము. మీరు ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం చేపట్టిన రైతు భరోసా కేంద్రాల వలన ఉపయోగం ఏముంది అని, ఇదే గ్రామంలో రెండు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి వాటి వలన రైతులకు ఏం ఉపయోగంలేదని పంట పండించుకోటానికి విత్తనాలు ఉండవని, రసాయనాలు ఉండవని, పోనీ అప్పు తెచ్చుకుని పంట పండించుకుంటే కొనేవారు ఉండరని ఒకవేళ కొన్న కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు రావని తెలియచేసారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి అని అందరూ రైతులకు ఎన్నికల సమయంలో ఇష్ట మొచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చి ప్రభుత్వాలు స్థాపించి రైతులకు జీవితాలు లేకుండా చేసి ఆత్మహత్యల పాలు చేస్తున్నారని ఆయన తెలిపోయారు. రైతులకు న్యాయం జరగాలంటే అది కేవలం ఒక్క జనసేన పార్టీ వలన మాత్రంమే సాధ్యం అని, వచ్చేది మన ప్రభుత్వమే అని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నిజమైన రైతు రాజ్యం చూస్తారని ఆయన తెలిపారు. ఈ ఆత్మహత్య మీద సంబంధిత అధికారులు స్పందించాలని ఆ రైతుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము అని ఆయన తెలిపారు.









