రుద్రంపేట పంచాయతీని ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేస్తాం…

    అనంతపురము ( జనస్వరం ) :  నియోజకవర్గం పరిధిలోని రుద్రంపేట పంచాయతీని ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేస్తామని జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ గారు అన్నారు. జనసేన జయభేరి కార్యక్రమంలో భాగంగా రుద్రంపేటకు చెందిన జనసేన నాయకులు ఆకుల అశోక్, శ్రీ హరి గార్ల సారధ్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన అర్బన్ ఇంచార్జ్  టి.సి.వరుణ్ గురువారం అజయ్ జోష్ కాలనీ, మదర్ తెరిసా కాలనీలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల్ని ఆప్యాయంగా పలకరించారు. స్థానికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. జనసేన – టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యల్ని పరిష్కరించడంతో పాటు కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీని మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేస్తామన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి, జనసేన టిడిపి పార్టీలను ఆశీర్వదించాలని టి.సి.వరుణ్  విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు  పొదిలి బాబురావు, రుద్రంపేట పంచాయతీ తెలుగుదేశం నాయకులు వైస్ ప్రెసిడెంట్  వరుణ్ చౌదరి, తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. 

See also  అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు అండగా నిలబడతాం : జనసేన నాయకులు యుగంధర్ పొన్న

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి