Logo
Date of Publish : 22 February 2024, 9:00 pm
Editor : Sake Naresh

రుద్రంపేట పంచాయతీని ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేస్తాం…

    అనంతపురము ( జనస్వరం ) :  నియోజకవర్గం పరిధిలోని రుద్రంపేట పంచాయతీని ఆదర్శ పంచాయతీగా అభివృద్ధి చేస్తామని జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ గారు అన్నారు. జనసేన జయభేరి కార్యక్రమంలో భాగంగా రుద్రంపేటకు చెందిన జనసేన నాయకులు ఆకుల అశోక్, శ్రీ హరి గార్ల సారధ్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన అర్బన్ ఇంచార్జ్  టి.సి.వరుణ్ గురువారం అజయ్ జోష్ కాలనీ, మదర్ తెరిసా కాలనీలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల్ని ఆప్యాయంగా పలకరించారు. స్థానికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. జనసేన - టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యల్ని పరిష్కరించడంతో పాటు కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. అర్బన్ నియోజకవర్గంలో రుద్రంపేట పంచాయతీని మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేస్తామన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఆదరించి, జనసేన టిడిపి పార్టీలను ఆశీర్వదించాలని టి.సి.వరుణ్  విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు  పొదిలి బాబురావు, రుద్రంపేట పంచాయతీ తెలుగుదేశం నాయకులు వైస్ ప్రెసిడెంట్  వరుణ్ చౌదరి, తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com