పేరంటాలపలెం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం

పేరంటాలపలెం

          అనకాపల్లి ( జనస్వరం ) ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం పేరంటాలపలెం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గం ఇన్చార్జ్ పరుచూరి భాస్కరరావు గారు పాల్గొన్నారు. ఈ సంద్భంగా జరిగిన సభలో భాస్కరరావు గారు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఇంటికీ జనసేన పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి జనసైనికుడిపై ఉంది అని అన్నారు. గ్రామాల్లో జనసైనికులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తప్పకుండా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సంద్భంగా పలువురు గ్రామస్థులు జనసేన పార్టీ లోకి చేరారు. వీరికి భాస్కరరావు గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండలం నాయకులు పావాడ కామరాజు, ఉత్తాడ రామరాజు, కలగా శ్రీనివాసరావు, గొంతిన ఈశ్వరరావు, కరణం రమణ, ఊడి నూకరాజు మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.

See also  ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యార్థినికి భీమవరం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ చినబాబు గారి చేతుల మీదుగా రూ. 20,000 ఆర్థిక సహాయం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి