ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘అనంత’ కవులకు ఘనసత్కారం

అనంతపురము, జనవరి 3 : ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో గుంటూరు వేదికగా మూడు రోజులపాటు ఘనంగా సాగే తెలుగు ప్రపంచ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రస్థాయి ప్రముఖులు, అవధానులు, అధికారులు, రచయితల నడుమ కవిసమ్మేళనాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా అనంతపురం తరపున సీనియర్ కవులు జెట్టి జైరామ్, డాక్టర్ జూటూరు షరీఫ్, డాక్టర్ అంకే రామలింగమయ్య, షేక్ రియాజుద్దీన్ అహ్మద్, గుంటి మురళీకృష్ణ భరద్వాజ్, ఎం. నాగముని, సామాజిక కార్యకర్త కృష్ణారెడ్డి తదితరులు కవిత గానం చేశారు. అద్భుతమైన కవిత్వీకరణతో సాగిన కవితలు ఆహుతులను అలరించాయి. వీరి ప్రతిభను మెచ్చుకుంటూ నిర్వాహకులు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించి సత్కరించారు. అంతకుముందు ప్రపంచ తెలుగు మహాసభల కన్వీనర్ రామచంద్రరాజు, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు, మూడుసార్లు గిన్నిస్ రికార్డుల గ్రహీత డాక్టర్ గజల్ శ్రీనివాస్ అనంత జిల్లా వాసులతో ముచ్చటించి అభినందించారు. అనంత కవులకు మహాసభల సమన్వయకర్త, ప్రముఖ సాహితీవేత్త కొల్లి రమావతి, ప్రముఖ కవయిత్రులు చౌటుపల్లి నీరజాచంద్రన్, సీనియర్ కవి చంద్రశేఖరశాస్త్రి, సయ్యద్ నజ్మాషమ్మీ,  చేతులమీదుగా ఘనంగా సన్మానము జరిగింది.

See also  పెండ్యాల హరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం