
గడిచిన పంచాయతీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం రేగాటి పల్లి పంచాయతి పరిధిలో జనసేన పార్టీకి ఓటు వేశారని సుమా రు 16 మందికి పింఛన్లను అధికారులు తొలగించారని జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి భార్య ఛాయాదేవి, సోదరుడు వెంకట్‌రెడ్డి తదితరులు బుధవారం ఆర్ డి ఓ మధుసూదన్ గారికి పింఛన్ దారులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో రేగాటిపల్లి పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు జనసేన పార్టీకి ఓటు వేయడంతో సహించుకోలేని అధికార పార్టీకి చెందిన నాయకులు అధికారుల అండతో అర్హులైన 16 మంది వృద్ధులకు. పింఛన్లను అందకుండా గత మూడు రోజులుగా తిప్పుతున్నారని, సంబంధిత అధికారులును వివరణ కోరగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని. దీంతో గత్యంతరం లేక ఆర్‌డిఓ గారికి వినతి పత్రాన్ని అందజేశామన్నారు. దీనిపై స్పందించిన ఆర్జిఓ మాట్లాడుతూ సంబంధిత విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని “అర్హులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. అనంతరం వృద్ధులకు జనసేన పార్టీ నాయకులు. చిలకం ఛాయాదేవి, చిలకం వెంకట్‌రెడ్డి, రాజారెడ్డి తదితరులు వారి సొంత నిధుల నుండి పింఛన్ కోల్పోయిన వృద్దులకు, అంధులకు పింఛన్ మొతాన్ని “అందజేశారు. ఈ కార్య క్రమంలొ జనసేన పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, పిక్కిలి మహేష్ రవి, లింగారెడ్డి, గుర్రప్ప, నరసింహులు పాల్గొన్నారు.









