Logo
Date of Publish : 05 March 2021, 4:59 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీకి ఓటు వేశారని ఫించన్ తొలగింపు, స్వంత డబ్బులతో వృద్ధులకి ఫించన్ అందించిన జనసేన నాయకులు

                గడిచిన పంచాయతీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం రేగాటి పల్లి పంచాయతి పరిధిలో జనసేన పార్టీకి ఓటు వేశారని సుమా రు 16 మందికి  పింఛన్లను అధికారులు తొలగించారని జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్  చిలకం మధుసూదన్‌ రెడ్డి భార్య ఛాయాదేవి, సోదరుడు వెంకట్‌రెడ్డి తదితరులు బుధవారం ఆర్‌ డి ఓ మధుసూదన్‌ గారికి పింఛన్‌ దారులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన సర్పంచ్‌ ఎన్నికల్లో రేగాటిపల్లి పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు జనసేన పార్టీకి ఓటు వేయడంతో సహించుకోలేని అధికార పార్టీకి చెందిన నాయకులు అధికారుల అండతో అర్హులైన 16 మంది వృద్ధులకు. పింఛన్లను అందకుండా గత మూడు రోజులుగా తిప్పుతున్నారని, సంబంధిత అధికారులును వివరణ కోరగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని. దీంతో గత్యంతరం లేక ఆర్‌డిఓ గారికి వినతి పత్రాన్ని అందజేశామన్నారు. దీనిపై స్పందించిన ఆర్జిఓ మాట్లాడుతూ సంబంధిత విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని "అర్హులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. అనంతరం వృద్ధులకు జనసేన పార్టీ నాయకులు. చిలకం ఛాయాదేవి, చిలకం వెంకట్‌రెడ్డి, రాజారెడ్డి తదితరులు వారి సొంత నిధుల నుండి పింఛన్‌ కోల్పోయిన వృద్దులకు, అంధులకు పింఛన్‌ మొతాన్ని "అందజేశారు. ఈ కార్య క్రమంలొ జనసేన పార్టీ నాయకులు సుధాకర్‌ రెడ్డి, పిక్కిలి మహేష్‌ రవి, లింగారెడ్డి, గుర్రప్ప, నరసింహులు పాల్గొన్నారు.

 

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com