అధికారులకు ఫేస్ కవర్లు పంపిణీ చేసిన జనసైనికులు

అధికారులకు ఫేస్ కవర్లు పంపిణీ చేసిన జనసైనికులు.

                మన ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకి  కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజలు కూడా బయటకు రావాలన్నా భయపడుతున్న సందర్భం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా పోలీసులు, డాక్టర్లు కూడా కరోనాను లెక్క చేయకుండా తమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో ముందున్నారు. అటువంటి అధికారులకు కూడా రక్షణ కరువు అవ్వడం చూస్తున్నాం. ఈ సందర్భంగా లావేరు జనసేన – బీజేపీ కార్యకర్తలు కలసి ఫ్రంట్ వారియర్ సంస్థ పేరిట ప్రజలకు అండగా ఉంటున్న డాక్టర్లకు, పోలీసులకు ఇతర అధికారులకు ఫేస్ కవర్లు అందజేశారు. లావేరు గ్రామ జనసేన, బీజేపీ నాయకులు పోలీసు స్టేషన్, సచివాలయ కార్యాలయం, ఆశా వర్కర్లకు, వ్యవసాయ శాఖ సిబ్బందికి ఫేస్ కవర్లు అందించి ఉదారతను చాటుకున్నారు. అధికారులు, గ్రామస్తులు మాట్లాడుతూ ఇటీవన్తి సహాయం చేయడం చాలా సంతోషకరమని అన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు రాజా రమేశ్, కోలా రాజేష్, రేగాన మూర్తి, బాసిన రవి, జనసేన యువకులు నవీన్, బీర నందు, కర్ర సాయి, ఉప్పు జగదీష్ బారుకుల శ్రీకాంత్, నోమీ పాల్గొన్నారు.   

See also  అనాధ పిల్లలకు 90 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించిన జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి