నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ ను ప్రజల సౌకర్యార్థం వాడుకోవాలని జనసైనికుల వినతి

నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ ను ప్రజల సౌకర్యార్థం వాడుకోవాలని జనసైనికుల వినతి. 

        వత్సవాయి మండల పరిధిలో వత్సవాయి  స్థానిక గాంధీ పార్క్ సెంటర్ నందు గల RTC బస్టాండ్ అనేది మరీ ఎప్పటినుంచో మండల పరిధిలో, గ్రామంలో ఉన్నప్పటికీ ఎక్కువగా నిరుపయోగంగా ఉంటుంది అని, అసంఘటిత కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజల సౌకర్యార్ధం కోసం ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించుకోవాలని నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్, కొర్రపాటి గోపీచంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున స్థానిక మండల డెవలప్మెంట్ ఆఫీసర్ వారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ  RTC వారికి సంబంధించిన ప్రతి బస్సు ప్రజల సౌకర్యార్ధం కోసం గాంధీ పార్క్ సెంటర్ లో ఉన్నటువంటి బస్టాండ్ కి వచ్చి ప్రయాణికులకు సహకరించాల్సిన అవసరం ఉందని, కానీ అలా జరగకుండా బస్సులు అన్ని మెయిన్ రోడ్ మీదుగా వెళ్తున్న పరిస్థితి ఉందని, ఏ విధంగా ప్రయాణికులకు ఉపయోగపడని ఈ బస్టాండ్ అనేది కేవలం అసంఘటిత కార్యక్రమాలకి మాత్రం ఉపయోగపడుతుంది అని ఆయన తెలిపారు. మరీ బస్టాండ్ ని ప్రయాణికుల సౌకర్యార్ధం కోసం ఉపయోగించుట లేదు కనుక, కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువగా బస్సులు కూడా వచ్చే అవకాశం లేనందున, దానిని ప్రభుత్వం వారు కొంచం చొరవ చూపించి “హెల్త్ కేర్ సెంటర్” గానో “రైతు బజార్ కేంద్రం” గానో లేదా రైతులు రైతులకి సంబంధించినంతవరకు పత్తి విత్తనాల్ని ప్రభుత్వం వారే కొనుగోలు కేంద్ర౦గా కూడా ఏర్పాటుచేసుకోవచ్చు అని ప్రభుత్వం వారిని కోరుతున్నామని ఆయన తెలిపారు. ఇన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉన్న ఈ బస్టాండ్ ని దయచేసి ప్రభుత్వం వారు అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా చూసి, ఎదో ఒక రకంగా ప్రజల సౌకర్యార్ధం కొరకు ఉపయోగించులోవాలని, జనసేన పార్టీ తరుపున మేము కోరుచున్నాము ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాషా, మహేష్, త్రిశాంత్ తదితరులు పాల్గొన్నారు.

See also  రోడ్డు ప్రమాదములో గాయపడ్డ జనసైనికులను పరామర్శించిన గుంటూరు జిల్లా జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి