Logo
Date of Publish : 31 July 2020, 12:09 pm
Editor : Sake Naresh

నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ ను ప్రజల సౌకర్యార్థం వాడుకోవాలని జనసైనికుల వినతి

నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ ను ప్రజల సౌకర్యార్థం వాడుకోవాలని జనసైనికుల వినతి. 

        వత్సవాయి మండల పరిధిలో వత్సవాయి  స్థానిక గాంధీ పార్క్ సెంటర్ నందు గల RTC బస్టాండ్ అనేది మరీ ఎప్పటినుంచో మండల పరిధిలో, గ్రామంలో ఉన్నప్పటికీ ఎక్కువగా నిరుపయోగంగా ఉంటుంది అని, అసంఘటిత కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజల సౌకర్యార్ధం కోసం ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించుకోవాలని నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్, కొర్రపాటి గోపీచంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన పార్టీ తరుపున స్థానిక మండల డెవలప్మెంట్ ఆఫీసర్ వారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ  RTC వారికి సంబంధించిన ప్రతి బస్సు ప్రజల సౌకర్యార్ధం కోసం గాంధీ పార్క్ సెంటర్ లో ఉన్నటువంటి బస్టాండ్ కి వచ్చి ప్రయాణికులకు సహకరించాల్సిన అవసరం ఉందని, కానీ అలా జరగకుండా బస్సులు అన్ని మెయిన్ రోడ్ మీదుగా వెళ్తున్న పరిస్థితి ఉందని, ఏ విధంగా ప్రయాణికులకు ఉపయోగపడని ఈ బస్టాండ్ అనేది కేవలం అసంఘటిత కార్యక్రమాలకి మాత్రం ఉపయోగపడుతుంది అని ఆయన తెలిపారు. మరీ బస్టాండ్ ని ప్రయాణికుల సౌకర్యార్ధం కోసం ఉపయోగించుట లేదు కనుక, కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువగా బస్సులు కూడా వచ్చే అవకాశం లేనందున, దానిని ప్రభుత్వం వారు కొంచం చొరవ చూపించి "హెల్త్ కేర్ సెంటర్" గానో "రైతు బజార్ కేంద్రం" గానో లేదా రైతులు రైతులకి సంబంధించినంతవరకు పత్తి విత్తనాల్ని ప్రభుత్వం వారే కొనుగోలు కేంద్ర౦గా కూడా ఏర్పాటుచేసుకోవచ్చు అని ప్రభుత్వం వారిని కోరుతున్నామని ఆయన తెలిపారు. ఇన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉన్న ఈ బస్టాండ్ ని దయచేసి ప్రభుత్వం వారు అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా చూసి, ఎదో ఒక రకంగా ప్రజల సౌకర్యార్ధం కొరకు ఉపయోగించులోవాలని, జనసేన పార్టీ తరుపున మేము కోరుచున్నాము ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాషా, మహేష్, త్రిశాంత్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com