బొబ్బిలి సబ్ స్టేషన్ లో గాయపడిన వ్యక్తిని పరామర్శించి, నిర్లక్ష్యత అధికారులపై చర్యలు తీసుకోవాలి

బొబ్బిలి

           విజయనగరం ( జనస్వరం ) : బొబ్బిలి కేంద్రంలో 132/33కేవీ సబ్స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో వాడాడ గ్రామానికి చెందిన వ్యక్తి  జనార్దన్ గారు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు మరియు జనసేన టీం ప్రమాద స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగింది, ఎందువల్ల జరిగింది అని విషయం తెలుసుకోవడం జరిగింది. అలాగే కార్మికులు అంతా కలిసి ప్రమాదం జరగడానికి మూల కారణం అయిన AE గారిపై కేసు పెట్టడానికి ముందుకు వస్తే బొబ్బిలి సీఐ గారు నిరాకరించడం వెనుక ఉన్న రహస్యం ఏంటి అని ప్రశ్నించారు.  అలాగే ఈ సమస్యపై రేపు పోలీస్ స్టేషన్కి వెళ్లి మాట్లాడడం జరుగుతుందని గాయపడిన కార్మికునికి అన్ని రకాలుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని పేర్కొన్నారు. 

See also  పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 24వ రోజు సేవా కార్యక్రమాలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి