
ఘనంగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) కృష్ణా జిల్లా జనరల్ బాడీ సమావేశం
మచిలీపట్నం,జూలై 02 ( జనస్వరం)
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి ఆదేశాల మేరకు మరియు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అమర్ బాబు సూచనలతో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎల్ ముత్యాల బాబు సలహాలతో అంతేకాకుండా సౌత్ ఇండియా ఉమెన్ పోర్ట్ జనరల్ సెక్రటరీ మరియు కృష్ణాజిల్లా ఇంచార్జ్ పోట్లూరి సత్యవతి ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI) కృష్ణా జిల్లా జనరల్ బాడీ (సాధారణ సర్వసభ్య) సమావేశం మచిలీపట్నం లో అత్యంత ఘనంగా నిర్వహించబడింది.ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుండి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ప్రతినిధులు, మానవ హక్కుల పక్షపాతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా కృష్ణాజిల్లా ఇంచార్జ్ పొట్లూరి సత్యవతి మాట్లాడుతూ సమాజంలో మానవ హక్కుల రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.సమాజంలో వెనుకబడిన, బలహీన వర్గాలకు అండగా నిలవడంలోనూ, వారికి చట్టాలపై అవగాహన కల్పించడంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
*సమావేశంలోని ముఖ్యమైన అంశాలు:*
హక్కులపై అవగాహన
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు మానవ హక్కులు, చట్టాలపై విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని తీర్మానించారు.
బాధితులకు అండగా
హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు బాధితులకు చట్టపరమైన సాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ లేదా విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు.
భవిష్యత్ కార్యాచరణ.
రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా కౌన్సిల్ తరఫున చేపట్టబోయే సామాజిక సేవా కార్యక్రమాలు, కమిటీల విస్తరణపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సమావేశంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ వింగ్ ప్రెసిడెంట్ నగేష్ బాబు, కృష్ణా జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గాల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.








