జనసేన పార్టీలోకి చేరిన RUSH హాస్పిటల్ అధినేత Dr. సిపాయి సుబ్రమణ్యం

       శ్రీకాళహస్తి, (జనస్వరం) : RUSH హాస్పిటల్ అధినేత, 2009 ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం తరఫున ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన Dr. సిపాయి సుబ్రమణ్యంని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జి వినుత కోటా  తిరుపతిలోని తన కార్యాలయంలో కలిసి జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. సిపాయి సుబ్రమణ్యం తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి నిన్నటి రోజు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించలేదని, ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానం నుండి ఆయన్ని ఆదరించిన అనుచరులకు, నమ్మి వెంట నడిచిన వారికి న్యాయం చెయ్యలేక పోయానని అసంతృప్తితో రాజీనామా చేశానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమి ఆశించకుండా తనని గుర్తించి, గౌరవించి తగిన ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అని తెలిపారు. తన సంపూర్ణ మద్దతు జనసేన పార్టీకి ఉంటుందని, 30 సం. లు గా వినుత కుటుంబంతో అనుభందం ఉన్నందున వినుతకి పూర్తి మద్దతు, ఆశీస్సులు ఉంటుందని తెలిపారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను వినుతకి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య పాల్గొన్నారు.

See also  ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల స్థలాల సేకరణను అడ్డుకున్న జనసేన నాయకులపై కేసులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి